Chandrababu: రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుకి ప్రత్యేక గది..ఇంటి భోజనంకి అనుమతి

Chandrababu: చంద్రబాబుకు ఇంటి భోజనాన్ని అనుమతించాలని కోర్టు ఆదేశాలు

Update: 2023-09-11 02:45 GMT

Chandrababu: రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుకి ప్రత్యేక గది..ఇంటి భోజనంకి అనుమతి

Chandrababu: స్కిల్ స్కాంలో అరెస్టయిన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రెండువారాలపాటు జ్యుడిషియల్ రిమాండ్ కు ఆదేశించింది. దీంతో అరెస్టుచేసిన చంద్రబాబును విజయవాడనుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించారు. సెంట్రల్ జైల్లోని స్నేహా బ్లాక్ లో ప్రత్యేక గదిని కేటాయించారు. సెంట్రల్ జైల్లో చంద్రబాబు రిజిస్ట్రేషన్ నంబరు7691గా నమోదైంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక వసతి కల్పించాలన్న కోర్టు ఆదేశాలతో జైలు అధికారులు ఏర్పాట్లును పూర్తి చేశారు. చంద్రబాబుకున్న హోదా, వయసును దృష్టిలో పెట్టుకుని మందులు, అవసరమైన వైద్యం అందించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. చంద్రబాబుకు ఇంటి భోజనాన్ని అనుమతించాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈనెల 22 తేదీ వరకు కోర్టు ఆదేశాల మేరకు రిమాండులో ఉండనున్నారు.

స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబునుంచి మరిన్ని వివరాలను రాబట్టేందుకు విచారించాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. దీంతో రిమాండులో ఉన్న చంద్రబాబును కస్టడీకి అప్పగించాలని సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలుచేశారు. ఇవాళ పిటిషన్ పై కోర్టులో విచారణకు రానుంది.

చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఇవాళ బెయిల్ కోరుతూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది.

ఇది ఇలా ఉంటే... ఏపీలోని వివిధ ప్రాంతాలనుంచి టీడీపీ కార్యకర్తలు, నాయకులు రాజమండ్రి చేరుకున్నారు. చంద్రబాబునాయుడుకు మద్ధతు తెలిపేందుకు వర్షంలో తడుచుకుంటూ వచ్చారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రాజమండ్రి పరిసరాల్లో ఎక్కడా... ఆందోళనకు, ప్రదర్శనలకు తావులేదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ముందస్తుగా సెక్షన్ 30ని అమలు చేస్తున్నారు. ఎక్కడా ఏ ఇద్దరు కలిసి మాట్లాడుతున్నా చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు.

చంద్రబాబునాయుడు అరెస్టు నేపథ్యంలో ఏపీ బంద్ కు టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. అన్ని మండల కేంద్రాల్లో టీడీపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేయాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News