Tirumala Darshanam: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్..రెండు రోజుల పాటు

Tirumala Darshanam: తిరుమలలో ఆదివారం సైతం కొనసాగుతున్న విపరీతమైన భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనార్థం 24గంటల సమయం పడుతుంది.

Update: 2024-11-03 05:05 GMT

Tirumala Darshanam: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం భారీ స్థాయిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీపావళి తర్వాత వచ్చిన వారాంతం కావడంతో భక్తులు శ్రీవారి దర్శనం కోసం బారులు తీరారు. 2 రోజులపాటు సెలవు దినాలు రావడం అందులోనూ రావాంతం కలిసి రావడంతో శ్రీవారి దర్శనార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు పూర్తిగా భక్తులతో నిండాయి. ఇక నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక షెడ్లలో కూడా భక్తులు కిక్కిరిసారు.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి దాదాపు 3కిలోమీటర్ల మేర క్యూలైన్ ఉంది. శిలాతోరణం వరకు క్యూలైన్ భక్తులతో నిండింది. గురువారం నాడు కాస్త తక్కువగా ఉన్న భక్తుల రద్దీ శుక్రవారం ఉదయం నుంచి పెరుగింది. దీంతో తిరుమలలో యాత్రికుల తాకిడి విపరీతంగా పెరిగింది. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూలైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ పంపిణీ చేస్తోంది. సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంలో ఎస్ఎస్డీ టైం స్లాట్ టోకెన్స్ లో టీటీడీ జారీ చేస్తుంది.

ఇక శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్లి ముక్కులు చెల్లించుకునే భక్తుల గురించి 5వేల టోకెన్లు జారీ చేస్తుంది. రోజుకు సుమారు 25వేల టైం స్లాట్ టికెట్లను టీటీడీ జారీ చేస్తుంది. ఈ రద్దీ మరో రెండు రోజుల కొనసాగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు టీటీడీ అధికారులు. వారాంతాలు కావడంతో తిరుమలలో సిఫార్సు లేఖలను రద్దు చేసింది టీటీడీ. స్వయంగా వచ్చిన ప్రముఖులకు బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనున్నట్లు తెలిపింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుండగా..శనివారం నాడు 88,076 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని ముక్కులు చెల్లించారు. స్వామివారి దర్శనం అనంతరం కానుకల రూపంలో హుండీలో శ్రీవారికి రూ. 3.52కోట్ల రూపాయలు భక్తులు చెల్లించారు.

ఆదివారం ఉదయం 8గంటల సమయంలో శ్రీవారి దర్శనార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని అన్ని కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ దాటుకుని శిలాతోరణం వరకు క్యూలైన్ వ్యాపించి ఉంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల నుంచి సమయం పడుతుందని వెల్లడించింది. ఇక శ్రీవారికి శనివారం నాడు 36, 829 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

Tags:    

Similar News