తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
మూడు రోజుల్లో ఎండ తీవ్రత పెరిగే ఛాన్స్
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో 43,44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని.. వాతావరణశాఖ హెచ్చరిస్తుంది. ఈ హీట్‌వేవ్ పరిస్థితుల్లో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే బయట అడుగుపెట్టాలంటే జంకుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండింతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అతి సాధారణంగా నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.