ISRO: శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి రాకెట్ ప్రయోగం
ISRO: ఉదయం 3.43 గంటలకు ప్రారంభమైన జీఎస్‌ఎల్వీ-ఎఫ్10 రాకెట్ ప్రయోగం * రేపు ఉ. 5.43 గంటలకు రోదసీలోకి వెళ్లనున్న రాకెట్
ISRO: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి (జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్10 వాహకనౌక ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ఇవాళ తెల్లవారుజామున 3.43 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 26 గంటలు కొనసాగిన తర్వాత గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ వాహకనౌక నింగిలోనికి దూసుకెళ్లనుంది. దీని ద్వారా 2వేల 268 కిలోల బరువు ఉన్న జీఐశాట్-1 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశ పెట్టనున్నారు. ఉపగ్రహం ద్వారా దేశ రక్షణ వ్యవస్థకు, విపత్తుల నిర్వహణకు ఉపకరించే భూ పరిశీలన అంశాలను తెలుసుకునే వీలుంది.