Rain Alert: పొంచి ఉన్న మరో ముప్పు..నేడు ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

Update: 2024-12-04 00:50 GMT

Rain Alert: తెలుగురాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణకు నేడు వర్షసూచన ఉన్నట్లు సూచించింది. అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. అది మరో రెండు రోజులపాటు ఉంటుంది. తర్వాత బలహీన పడుతుంది. దాని ప్రభావం ఏపీ, తెలంగాణపై లేనప్పటికీ ఇవాళ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. అయితే తెలంగాణలో ఇవాళ, రేపు కూడా వర్షాలు పడతాయని హైదారబాద్ లోని వాతావరణ అధికారులు తెలిపారు.

నేడు తెలుగు రాష్ట్రాల్లో రోజంతా మేఘాలు వస్తుపోతుంటాయి. ఉదయం 11 తర్వాత రాయలసీమ, ఉత్తర తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత సాయంత్రం వరకు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. మొత్తంగా నేడు రెండు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తెలంగాణలో సాధారణంగా గంటకు 11 కిలోమీటర్లు గాలివేగం ఉంటుంది. ఏపీలో సాధారణంగా గంటకు 12కిలోమీటర్ల వేగంతో ఉంటుంది. ప్రస్తుతం గాలులన్నీ అరేబియా సముద్రంలో ఉన్న అల్పపీడనం వైపు వెళ్తున్నాయి. ఇక తెలంగాణలో మాగ్జిమం 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఏపీలో 31 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రి చలి తగ్గి వేడి పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

Tags:    

Similar News