Kakinada Port: కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్‌లో మళ్లీ తనిఖీల హంగామా.. ఈసారి ఏం దొరుకుతుందో!!

Update: 2024-12-04 14:15 GMT

Stella L Panama ship anchored at Kakinada port: కాకినాడ పోర్టులో మరోసారి స్టెల్లా షిప్‌లో తనిఖీలు చేపట్టారు. పోర్ట్ కస్టమ్స్, పౌరసరఫరాల శాఖ, పోలీసులు, రెవిన్యూ శాఖ అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఇప్పటికే ఈ నౌకలో భారీ మొత్తంలో రేషన్ బియ్యం ఉన్నట్లు గతంలో జరిగిన తనిఖీల్లో తేలింది. అందుకే షిప్‌ను సీజ్ చేయండంటూ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఆదేశాలు జారీచేశారు. పవన్ కళ్యాణ్ ఈ తనిఖీల్లో కీలకంగా వ్యవహరించారు.

తాజాగా మరోసారి అధికారుల బృందం స్టెల్లా షిప్‌లో తనిఖీలు చేపట్టింది. రెండోసారి తనిఖీల్లో మరింత లోతుగా పరిశీలిస్తే ఇప్పటివరకు వెలుగు చూడని వాస్తవాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.

తనిఖీలు జరిగినప్పుడు అక్రమ పద్ధతుల్లో రవాణా జరిగే వస్తు సామాగ్రిని గుర్తించడంలో ఒక్కో శాఖకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందుకే ఈసారి వివిధ శాఖల అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో ఏం బయటపడుతుందోననే సస్పెన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే.. కాకినాడ పోర్టు ద్వారా తెలుగు గడ్డపై నుండి పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం సౌతాఫ్రికాకు సగ్మింగ్ రూపంలో తరలిపోతున్నాయనే విషయం ఇటీవల తనిఖీల్లో బయటపడే వరకు తెలియదు. అలాగే ఈ రెండో తనిఖీల్లో కూడా ఏదైనా కొత్త కోణం వెలుగు చూస్తుందా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News