YS Jagan: నేడు వైసీపీ నేతలతో జగన్ కీలక సమావేశం

YS Jagan: వైసీపీ అధినేత జగన్ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ ఆఫీస్‌లో పార్టీ నేతలతో కీలక మీటింగ్‌ నిర్వహించనున్నారు.

Update: 2024-12-04 04:19 GMT

YS Jagan: నేడు వైసీపీ నేతలతో జగన్ కీలక సమావేశం

YS Jagan: వైసీపీ అధినేత జగన్ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ ఆఫీస్‌లో పార్టీ నేతలతో కీలక మీటింగ్‌ నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతం, నిర్మాణంపై దృష్టి సారించిన ఆయన.. పార్టీ కమిటీల ఏర్పాటుపై చర్చించనున్నారు. కూటమి ప్రభుత్వంలో భారీగా కరెంటు ఛార్జీలు పెంచుతున్నారని ఆరోపిస్తున్న వైసీపీ...దీనిపైనా ఎలాంటి ఆందోళనలు నిర్వహించాలనే విషయంపై సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ధాన్యం సేకరణ, రైతులను దోచుకుంటున్న దళారులు తీరు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంపైనా కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ విషయాలపై ప్రణాళికను రూపొందించి వైఎస్ జగన్ పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు. ఈ మీటింగ్‌కు పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లు, జనరల్‌ సెక్రటరీలు, పార్టీ సెక్రటరీలు హాజరుకానున్నారు. 

Tags:    

Similar News