బియ్యం మాఫియాను అరికడతాం: కేబినెట్ సమావేశంలో చంద్రబాబు

AP Cabinet Meeting: బియ్యం, భూదందా మాఫియాలను అరికడతామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.

Update: 2024-12-03 11:07 GMT

బియ్యం మాఫియాను అరికడతాం: కేబినెట్ సమావేశంలో చంద్రబాబు

AP Cabinet Meeting: బియ్యం, భూదందా మాఫియాలను అరికడతామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం మంగళవారం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

కాకినాడ పోర్టును బలవంతంగా లాక్కున్నారని ఆయన ఆరోపించారు. కాకినాడ సెజ్ ను కూడా లాగేసుకున్నారన్నారు. కాకినాడ పోర్టులో కేవీరావుకు 41 శాతం వాటా ఇచ్చి 59 శాతం అరబిందో వాళ్లకు కట్టబెట్టారని చంద్రబాబు అన్నారు. ఆస్తులు లాక్కోవడం వైసీపీ హయంలో ట్రెండ్ గా ఉందన్నారు. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలా ఆస్తులు లాక్కోవడం చూడలేదని సీఎం చెప్పారు.

వ్యవస్థలను జగన్ బాగా డ్యామేజీ చేశారన్నారు. తప్పులు చేసి ఇప్పుడు ఆయనే అరుస్తున్నారని జగన్ పై ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజల స్పందనను ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలను సేకరిస్తున్నామని ఆయన వివరించారు. మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 12కు ఆరు నెలలు అవుతోంది.. ఎవరేవరు ఏం చేశారో సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం మంత్రులను ఆదేశించారు.

Tags:    

Similar News