Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..ఇక నుంచి వారికి ఫ్రీ దర్శనం

Update: 2024-12-02 00:51 GMT

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్థానికులకు తిరుమల దర్శనంపై కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. తిరుపతి వాసుల కోసం టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలను తీసుకున్నట్లు తెలిపింది.

తిరుపతి వాసుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానికులకు తిరుమల దర్శనంపై కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. తిరుపతి వాసుల కోసం టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. స్థానిక భక్తులు ప్రతీ నెలా మొదటి మంగళవారం ఫ్రీగా శ్రీవారిని దర్శనం పొందే అవకాశాన్ని కల్పించింది టీటీడీ. ఈ పథకం డిసెంబర్ 3 నుంచి ప్రారంభం కాబోతోంది.

టోకెన్ల జారీ తేదీ: డిసెంబర్ 2

తిరుపతి మహతి ఆడిటోరియం: 2,500 టోకెన్లు

తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్: 500 టోకెన్లు

సమయం: ఉదయం 3:00 నుంచి 5:00 గంటల వరకు

మొదటి ప్రాధాన్యత: ముందుగా వచ్చిన వారికి టోకెన్లు.

దర్శనానికి అవసరమైన ముఖ్యమైన సూచనలు..

ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. టోకెన్లు పొందేందుకు, అలాగే దర్శనానికి వచ్చినప్పుడు ఒరిజినల్ ఆధార్ కార్డు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి.

దివ్యదర్శనం క్యూలైన్: టోకెన్లు పొందిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఫుట్‌పాత్ హాల్ క్యూలైన్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులకు సూచించింది.

ఉచిత లడ్డూ: ఇతర దర్శనాల్లో మాదిరిగా, ఈ కోటా ద్వారా దర్శనం చేసుకున్న భక్తులకు ఒక లడ్డూ ఫ్రీగా అందిస్తారు.

పునర్వసతి సమయం:

ఒకసారి స్థానిక కోటా ద్వారా దర్శనం పొందినవారు తర్వాత 90 రోజులకు తిరిగి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని టీటీడీ తెలిపింది.

టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు:

తిరుపతిలో నివసించే స్థానికులకు ప్రతినెలా మొదటి మంగళవారం ఫ్రీగా దర్శనం కల్పించేందుకు ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భక్తులకు సూచనలు చేసింది. ఈ అవశాశం సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.

Tags:    

Similar News