Rishiteshwari suicide case: రిషితేశ్వరి సూసైడ్ కేసు కొట్టివేత
Rishiteshwari suicide case: రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు జిల్లా కోర్టు శుక్రవారం కొట్టివేసింది.
Rishiteshwari suicide case: రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు జిల్లా కోర్టు శుక్రవారం కొట్టివేసింది. ప్రాసిక్యూషన్ నేరం నిరూపించలేకపోయిందని కోర్టు కేసును కొట్టివేసింది. 2015 జులై 14న రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. నాగార్జున యూనివర్శిటీలో ఆర్కిటెక్ట్ చదువుతున్న రిషితేశ్వరి ఆత్మహత్య అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. సీనియర్ల ర్యాగింగ్ తో ఆత్మహత్య చేసుకున్నానని ఆమె రాసినట్టుగా ఉన్న సూసైడ్ నోట్ ను అప్పట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా పెద్దకాకాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తొమ్మిదేళ్ల పాటు విచారణ సాగింది. 170 మంది సాక్షుల విచారించింది కోర్టు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత కేసును కొట్టివేసింది. నేరం నిరూపించలేని కారణంగానే కేసును కొట్టివేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.
సీఎంను కలుస్తాం...రిషితేశ్వరి పేరేంట్స్
రిషితేశ్వరి సూసైడ్ కేసును కొట్టివేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలుస్తామని పేరేంట్స్ మీడియాకు చెప్పారు. పై కోర్టులకు వెళ్లే ఆర్ధిక స్థోమత తమకు లేదన్నారు. ప్రభుత్వమే సహాయం చేయాలని కోరారు. ఈ కేసులో న్యాయం జరగకపోతే మరణమే శరణ్యమని వారు చెప్పారు.