Tirumala: తిరుమల వెళ్లే రాజకీయనేతలకు హెచ్చరిక.. ఇవాళ్టి నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు

Tirumala: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై టీటీడీ నిషేధం విధించింది.

Update: 2024-11-30 05:54 GMT

Tirumala: తిరుమల వెళ్లే రాజకీయనేతలకు హెచ్చరిక.. ఇవాళ్టి నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు

Tirumala: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై టీటీడీ నిషేధం విధించింది. ఇందుకు సంబంధించిన నిబంధనలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. నిత్యం గోవింద నామాలతో మారుమోగే తిరుమల క్షేత్రంలో దర్శనార్థం వచ్చిన రాజకీయ నాయకులు కొందరు ప్రసంగాలు, విమర్శలు చేయడం పరిపాటిగా మారింది.

ఈ క్రమంలో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతుందని భావించిన టీటీడీ బోర్డు.. రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. తిరుమలకు విచ్చేసే రాజకీయ నేతలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Tags:    

Similar News