మీటింగ్ కు ఎందుకు రాలేదు?: బూడిద వివాదంపై జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఆదినారాయణరెడ్డి ఫైర్

బూడిద వివాదం పరిష్కరిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్పారు. బూడిద వివాదంపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గాల మధ్య వివాదం నడుస్తోంది.

Update: 2024-11-29 14:34 GMT

  మీటింగ్ కు ఎందుకు రాలేదు?: బూడిద వివాదంపై జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఆదినారాయణరెడ్డి ఫైర్

బూడిద వివాదం పరిష్కరిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్పారు. బూడిద వివాదంపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ వివాదంపై చర్చించేందుకు రావాలని సీఎంఓ నుంచి ఆది నారాయణరెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డికి పిలుపు వెళ్లింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి శుక్రవారం చంద్రబాబును కలిశారు.తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం చంద్రబాబుతో సమావేశానికి దూరంగా ఉన్నారు. అనారోగ్యం కారణంగా ఈ సమావేశానికి ఆయన దూరంగా ఉన్నారని సమాచారం. కడప ఆర్టీపీపీ నుంచి బూడిద తరలించే విషయమై రెండు వర్గాల మధ్య వివాదం కారణంగా ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఆర్టీపీపీ వద్ద పోలీసులు మోహరించారు.

లేఖ రాసి ఎందుకు రాలేదు...జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఆదినారాయణ రెడ్డి ఫైర్

బూడిద విషయంలో ఇంత పెద్ద లేఖ రాసి చంద్రబాబు వద్ద సమావేశానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎందుకు రాలేదని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుతో భేటీ ముగిసిన తర్వాత అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. బూడిద విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గొడవ చేశారని ఆయన విమర్శించారు. పెద్ద పెద్ద లేఖలు రాసిన ప్రభాకర్ రెడ్డి సీఎం వద్ద మీటింగ్ కు ఎందుకు రాలేదో చెప్పాలన్నారు. ప్రభాకర్ రెడ్డి రాకపోయినా ఏం జరిగిందో చంద్రబాబు తెలుసుకుంటారన్నారు. బూడిద విషయంలో తమ వాదనను తాము వినిపించామన్నారు. ఈ విషయాన్ని పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని ఆదినారాయణ రెడ్డి చెప్పారు. స్థానికులకు ఇచ్చిన తర్వాతే బూడిదను ఇతరులకు ఇవ్వాలని సీఎంకు చెప్పామన్నారు.

Tags:    

Similar News