Cyclone Fengal: దూసుకువస్తున్న ఫెంగల్ తుఫాన్..ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Update: 2024-11-30 00:51 GMT

Cyclone Fengal: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నిన్న తుపాన్ గా బలపడింది. ఈ ప్రభావంతో నేడు, రేపు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం తుపాన్ గా బలపడిందని ఐఎండీ హెచ్చరించింది. ఈ తుపాన్ కు ఫెంగల్ గా నామకరణం చేశారు. ఉత్తర వాయువ్య దిశగా ఫంగల్ తుపాన్ పయనించే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. తుపాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో నేడు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆకస్మిక వరదలు పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ జారీ చేసింది. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

దక్షిణ కోస్తాలో నేడు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు రేపు కొన్ని చోట్లు అతి భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ పేర్కొంది. రాయలసీమలో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన చోట్ల ఆదివారం వరకు విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. శుక్రవారం నుంచి రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా రోజంతా కోస్తాంధ్ర ,రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ తుపాను కారణంగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మారుమూల ప్రాంతాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఫెంగల్ తీరాన్ని చేరుకోకముందే, తమిళనాడు ప్రభుత్వం శనివారం ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ రోజు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. ఐటి కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుండి పని చేయమని కోరింది.

శనివారం మధ్యాహ్నం ఈస్ట్ కోస్ట్ రోడ్డు, పాత మహాబలిపురం రోడ్డులో ప్రజా రవాణా నిలిపివేసింది. రెవెన్యూ విపత్తు నిర్వహణ మంత్రి KKSSR రామచంద్రన్ సన్నద్ధత సహాయక చర్యలను సమీక్షించడానికి రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఫెంగల్ తుఫాను ప్రభావం కారణంగా, అధిక ఆటుపోట్లు, వర్షంతో వాతావరణంలో మార్పులు కనిపించాయి. ఫెంగల్ తుఫాను ఈ రోజు పుదుచ్చేరి తీరప్రాంతాన్ని తాకనుంది.

ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగాల్ తుఫాను గత ఆరు గంటల్లో గంటకు 7 కి.మీ వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్నట్లు IMD తెలిపింది. తుఫాను పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాలను పుదుచ్చేరికి సమీపంలోని కారైకాల్, మహాబలిపురం మధ్య దాటే అవకాశం ఉంది. తుఫాను తుఫాను గంటకు 70-80 కి.మీ/గం. వేగంతో వీచే అవకాశం ఉంది.

Tags:    

Similar News