Tirumala Special Utsavalu : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..డిసెంబర్ విశేష పర్వదినాలు, ప్రత్యేకత ఏంటంటే
Tirumala Special Utsavalu: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యగమనిక. తిరుమల శ్రీవారికి ప్రతినెలా విశేష పర్వదినాలు ఉంటాయి. తిరుమలతోపటు టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ ఈ విశేష పర్వదినాలు ఉంటాయి. డిసెంబర్ నెలకు సంబంధించి తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలకు సంబంధించిన వివరాలను టీటీగీ వెల్లడించింది. ఈ మేరకు ఆయా తేదీలు, ఉత్సవాల గురించి పేర్కొంది. డిసెంబర్ 15న శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం జరుగుతుంది.
డిసెంబర్ 1న శ్రీవారి ఆలయంలో 4వ విడత అధర్వణ వేదపారాయణం ప్రారంభమవుతుంది. 11న సర్వ ఏకాదశి, 12న చక్రతీర్థ ముక్కోటి, 13న తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర ఉంటుంది. ఈనెల 14న తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, 15న శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. 16న ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అలాగే డిసెంబర్ 26న సర్వఏకాదశి, 29న మాస శివరాత్రి, తొండరడిప్పొడియాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, 30న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం అవుతాయి.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయానికి చేరుకున్న మంత్రికి టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈవోలు వీరబ్రహ్మం, గౌతమి, సీవీ అండ్ ఎస్వో శ్రీధర్, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనాంతరం ప్రసాదాలు అందించారు.
ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కార్తీక బ్రహ్మోత్సవాలు మొదటిరోజైన గురువారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు మురళి కృష్ణుడి అలంకారంలో పిల్లనగ్రోవి ధరించి చిన్న శేషవాహనంపై అభయం ఇచ్చారు. మొదటి వాహనం చిన్న శేషుడు. అమ్మవారు జీవకోటిని ఉద్దరించే లోకమాతగా దర్శనమిస్తారు. శేషభూతమైన ఈ ప్రపంచం సిరులతల్లి రక్షణలో సంతోషంగా ఉంది. ఈ వాహనంపై అమ్మవారం దర్శనం వల్ల యోగసిద్ధి చేకూరుతుందని భక్తుల విశ్వసిస్తుంటారు.