School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్..నేడు పాఠశాలలకు సెలవు

Update: 2024-12-01 23:49 GMT

School Holidays: ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో ప్రభుత్వం సోమవారం పాఠశాలలకు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. దీంతో మరికొన్ని జిల్లాల్లో కూడా పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

దక్షిణ భారతంపై వరణుడు తుపాన్ రూపంలో విరుచుకుపడుతున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాన్ తమిళనాడుతోపాటు ఏపీ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఫెంగల్ తుపాన్ తీరం దాటినా కూడా భూభాగంపైనే ఇంకా కొనసాగుతుందని విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంత రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

తమిళనాడుతోపాటుగా తెలంగాణలో కూడా ఈ తుపాన్ ఎఫెక్ట్ కారణంగా డిసెంబర్ 2,3 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడులో పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలత చెన్నైనగరం పూర్తిగా నీటిలోతేలియాడుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాన్ క్రమంగా బలహీనపడి..రానున్న 4గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం కారణంగా రేపు కోనసీమ, కాకినాడ, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించింది.

ఫెంగల్ తుపాన్ కారణంగా రేపు చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు కాలేజీలకు సెలవుల ఇస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. అయితే నెల్లూరు, తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ జిల్లాల్లో కూడా సెలవులు ఇవ్వాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

Tags:    

Similar News