Alla Nani: టీడీపీ గూటికి ఆళ్ల నాని..?

Alla Nani: మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీ గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Update: 2024-12-03 05:30 GMT

Alla Nani: టీడీపీ గూటికి ఆళ్ల నాని..?

Alla Nani: మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీ గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇవాళ కేబినెట్‌ భేటీ అనంతరం.. సీఎం చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని టీడీపీ కండువా కప్పుకుంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఆళ్ల నాని.. ఏలూరు అసెంబ్లీ స్థానానికి వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఆ తర్వాత వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి ఆళ్ల నాని రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన జనసేనలో చేరుతారని ప్రచారం జరిగినా.. చివరకు టీడీపీ వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఆళ్ల నాని మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు.

Tags:    

Similar News