Sajjala Bhargava Reddy: సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టు లో లభించని ఊరట

Sajjala Bhargav Reddy: సజ్జల భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు స్వీకరించలేదు.

Update: 2024-12-02 07:42 GMT

సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టు లో లభించని ఊరట

Sajjala Bhargav Reddy: సజ్జల భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు స్వీకరించలేదు. సోషల్ మీడియాలో పోస్టులపై ఏపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని సుప్రీంకోర్టులో ఆయన పిటిన్ దాఖలు చేశారు.తనపై కొత్తగా కేసులు నమోదు చేయవద్దని కూడా ఆయన ఆ పిటిషన్ లో కోరారు. భార్గవ్ రెడ్డి తన వాదనలను ఏపీ హైకోర్టులో వినిపించాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది.

ఎప్పుడో జరిగిన ఘటనలకు సంబంధించి బీఎన్ఎస్ చట్టాల ప్రకారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారని.. ఇవి చెల్లవని భార్గవ్ రెడ్డి తరపు న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.ఈ విషయమై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతుందని..ఆయనకు డిసెంబర్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు రక్షణ కల్పించిన విషయాన్ని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్దార్ద్ లూథ్రా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.

Tags:    

Similar News