Metro Rail: ఏపీ ప్రజలకు శుభవార్త..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

Update: 2024-12-03 00:39 GMT

Metro Rail: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి మహానగరాలకే పరిమితం అయిన మెట్రో సేవలను త్వరలోనే ఏపీలోకి కూడా అందుబాటులోకి తీసుకురానుంది. తాజాగా విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రోకు సంబంధించి ప్రభుత్వం ఈ కీలక ప్రకటన వెలువరించింది. ఈ రెండు నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుల తొలి దశ డీపీఆర్ లకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

విశాఖ మెట్రో ప్రాజెక్టులో ఫస్ట్ ఫేజ్ 46.23కిలోమీటర్ల మేర 3 కారిడార్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది. అవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంటే

ఫస్ట్ కారిడార్: విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.4 కి.మీ

సెకండ్ కారిడార్: గురుద్వార్ నుంచి పాత పోస్ట్‌ ఆఫీస్ వరకు 5.08 కిలోమీటర్లు

థర్డ్ కారిడార్: తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75 కి.మీ

మొత్తంగా 11,498 కోట్ల వ్యయంతో వీటిని చేపట్టనున్నారు. ప్రాజెక్టు రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు వరకు 30,67కిలోమీటర్ల మేర నాలుగో కారిడార్ ను నిర్మించేందుకు ప్రణాళికలను రెడీ చేస్తున్నారు.

విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ కు కూడా రాష్ట్ర సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు రెండు దవల్లో చేపడుతున్నారు. కారిడార్ 1: గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్.. కారిడార్ 1: పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు

మొత్తం 38.4 కిలోమీటర్లు ఈ 2 దశల్లో మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. దీనికి సంబంధించి రూ. 11,009 కోట్ల వ్యయం అంచనా వేశారు. భూసేకరణ కోసం రూ. 1,152 కోట్లు ఖర్చు చేయనున్నారు. రెండో దశలో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకు మూడో కారిడార్ ను నిర్మిస్తారు.

Tags:    

Similar News