Chandrababu Naidu: కాకినాడ పోర్టుకు ఐపీఎస్ అధికారి నియామకం?
Chandrababu Naidu: కాకినాడ పోర్టుకు ప్రత్యేకంగా ఐపీఎస్ అధికారిని నియమించాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులతో సోమవారం ఆయన చర్చించారు
Chandrababu Naidu: కాకినాడ పోర్టుకు ప్రత్యేకంగా ఐపీఎస్ అధికారిని నియమించాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులతో సోమవారం ఆయన చర్చించారు.ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇంటలిజెన్స్ డీజీ మహేష్ చంద్ర లడ్డాలు సోమవారం సాయంత్రం చంద్రబాబుతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ఈ విషయమై చర్చించారు.
బియ్యం అక్రమ రవాణాపై చంద్రబాబుతో పవన్ చర్చలు
కాకినాడ పోర్టు కేంద్రంగా బియ్యం అక్రమ రవాణపై ఏపీ డిప్యూట్ సీఎం పవన్ కళ్యాణ్.. సీఎం చంద్రబాబుతో సోమవారం చర్చించారు. నాలుగు రోజుల క్రితం కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం సీజ్ అంశాన్ని సీఎంకు ఆయన వివరించారు. పోర్టు కేంద్రంగా బియ్యం అక్రమ రవాణపై ఆదేశించాలని ఆయన సీఎంను కోరారు. ఈ నెల 4న ఏపీ కేబినెట్ సమావేశం ఉంది.ఈ సమావేశంలో దీనిపై చర్చించనున్నారు. బియ్యం అక్రమ రవాణకు సంబంధం ఉన్నవారిని కఠినంగా శిక్షిస్తే భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కావని పవన్ కళ్యాణ్ చెప్పారని సమాచారం.
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం సరఫరా విషయమై మంత్రివర్గ ఉపసంఘం సీరియస్ అయింది. వేర్ హౌస్ లలో అక్రమ రవాణాను అరికట్టకపోగా ప్రోత్సహించారని ఆగ్రహం వ్యక్తం చేసింది కేబినెట్ సబ్ కమిటీ.. ఐదు సార్టెక్స్ మిషన్ లు వేర్ హౌస్ లోకి ఎలా వచ్చాయని అధికారులను మంత్రులు ప్రశ్నించారు. సార్టెక్స్ మిషన్లు ఎలా వచ్చాయి... ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నాయో సమాచారం ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రశ్నించింది.