MLC Election Result: ఉభయ గోదావరి జిల్లా టీచర్ ఎమ్మెల్సీగా గోపి మూర్తి గెలుపు

AP Teacher MLC Election Result: ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా గోపిమూర్తి 4,155 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

Update: 2024-12-09 08:12 GMT

MLC Election Result: ఉభయ గోదావరి జిల్లా టీచర్ ఎమ్మెల్సీగా గోపి మూర్తి గెలుపు

Teacher MLC Election: ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా గోపిమూర్తి 4,155 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. డిసెంబర్ 5న ఎమ్మెల్సీ పోలింగ్ జరిగింది. ప్రధానంగా గంధం నారాయణరావు, గోపిమూర్తి మధ్యే పోటీ సాగింది. పీడీఎఫ్ మద్దతిచ్చిన గోపిమూర్తికి 9,163 ఓట్లు వచ్చాయి.గంధం నారాయణరావుకు 5,008 ఓట్లు దక్కాయి.500 ఓట్లు చెల్లలేదు. తొలి ప్రాధాన్యత ఓట్లతోనే గోపిమూర్తి గెలిచారు.

మొత్తం 16,737 మంది ఓటర్లలో 15,495 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 11 మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఎమ్మెల్సీగా ఉన్న షేక్ షాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News