Srikakulam: శ్రీకాకుళంలో బంద్ పాటిస్తున్న స్వర్ణకారులు
*చిన్నబంగారు షాపు యజమానులు *HUID విధానం, కార్పొరేట్ వ్యాపారస్తుల వల్ల.. *తామంతా నష్టపోతున్నామని ఆవేదన
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో ఉన్న స్వర్ణకారులు, చిన్న బంగారు షాపు యజమానులు సంయుక్తంగా ఒకరోజు బంద్ పాటిస్తున్నారు. ముఖ్యంగా HUID విధానం, కార్పొరేట్ బంగారు వ్యాపారుల వల్ల నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలంటూ బంద్ పాటిస్తున్నారు. బంగారం పనుల మీద జిల్లా వ్యాప్తంగా 10 వేల మంది బతుకుతున్నామని, తామంతా రోడ్డున పడే అవకాశముందంటూ వాపోతున్నారు.