Neeraja Reddy: ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి దుర్మరణం..

Neeraja Reddy: కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే పాటిల్ నీరజారెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.

Update: 2023-04-16 12:33 GMT

Neeraja Reddy: ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి దుర్మరణం..

Neeraja Reddy: కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే పాటిల్ నీరజారెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. హైదరాబాద్‌ నుంచి కర్నూలు వెళ్తుండగా జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల వద్ద కారు బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఆమె తల, ఇతర శరీర భాగాలకు సైతం తీవ్రంగా గాయాలు అయ్యాయి.

దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నీరజారెడ్డి మృతి చెందారు. నీరజారెడ్డి 2009లో ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2011లో నియోజకవర్గంలో పనులు జరగడం లేదని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి గుడ్ బై చెప్పి రాజకీయాలకు దూరంగా ఉండి.. 2019లో వైసీపీలో చేరారు. అనంతరం ఆమె అధికార పార్టీని వీడి బీజేపీలో చేరారు.

Tags:    

Similar News