అమ్మాయి పేరుతో ఫేస్ బుక్ ఖాతా తెరిచి ప్రేమిస్తున్నానంటూ మోసానికి పాల్పడిన ఓ యువకుడు కటకటాల పాలయ్యాడు. విశాఖ నగరానికి చెందిన మహేశ్వర్ రావు ఫేస్ బుక్ ద్వార పరిచయం అయిన అమ్మాయితో తరచూ చాటింగ్ మొదలు పెట్టాడు. మహేశ్వర్ రావును ఆర్ధిక సహాయం చేయాలంటూ కోరడంతో నిజమే అనుకుని డబ్బులు అకౌంట్ లో వేస్తూ వచ్చాడు. డబ్బు అవసరం ఉన్నప్పుడే మెసేజ్ చేస్తుంటడంతో మహేశ్వర్ రావుకు అనుమానం వచ్చింది. సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఫేస్ బుక్ లో చాటింగ్ చేసింది అబ్బాయిగా గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవుకు చెందిన జగదీష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇతడి నుంచి 80 వేల రూపాయల నగదు, మొబైల్ ఫోన్ స్వాదీనం చేసుకున్నారు.