కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు
ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపైన కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదన సాధ్యమయ్యే
ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపైన కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదన సాధ్యమయ్యే విషయం కాదని అయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న చోటే ఏపీ రాజధానికి అనుకూలమైన ప్రాంతమని, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయాలు వేర్వేరు చోట్ల ఉండడం కూడా సాధ్యం కాదని ఆయన వాఖ్యానించారు.
అంతేకాకుండా గతంలో మద్రాసు నుంచి రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు 1953లో కర్నూలు రాజధానిగా ఉన్న సమయంలో గుంటూరులో హైకోర్టు సాధ్యపడలేదని ఆయన అన్నారు.అయితే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించిన తరువాతే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా స్పందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
మూడు రాజధానుల విషయంలో కాంగ్రెస్ పార్టీ తన వైఖరి ఏమిటన్నది ఇంకా స్పష్టం చేయని సమయంలో ఆ పార్టీ నేత జైరాం రమేష్ ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హట్ టాపిక్ గా మారాయి. ఇక ఏపీ రాజధాని మార్పు పైన అమరావతి రైతులు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే.