Cyclone: తీర ప్రాంత ప్రజానీకాన్ని దడపుట్టిస్తున్న సైక్లోన్ సీజన్
Cyclone: సైక్లోన్ సీజన్... తీర ప్రాంత ప్రజానీకాన్ని దడపుట్టిస్తోంది. సందర్భం ఏదైనా సరే సముద్రంలో కల్లోలం ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
Cyclone: సైక్లోన్ సీజన్... తీర ప్రాంత ప్రజానీకాన్ని దడపుట్టిస్తోంది. సందర్భం ఏదైనా సరే సముద్రంలో కల్లోలం ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఒక్కో సందర్భంలో ఒక్కో పేరుతో తుఫాన్ అలజడి రేపుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం అనగానే కోస్తాంధ్ర ప్రజల మనసులో అలజడి మొదలవుతుంది.. ఎక్కడో అల్పపీడనంతో కడలి కల్లోలం అంటేనే ఈ తీర ప్రాంతాల ప్రజలకి ఆందోళన రెట్టింపు అవుతుంది. కారణం ఈ సీజన్లో వచ్చే తుఫాన్ ల ముప్పు. పేరేదైనా, ఎక్కడ తీరం దాటినా కొస్త్రాంధ్ర మిద మాత్రం కొంత అయిన ప్రబావం చూపుతాయి. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు సైక్లోన్ సీజన్ లో ఎప్పుడు ఏపేరుతో తుఫాన్ ముంచుకొస్తుందోనని తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
నైరుతి ఋతుపవనాలు నిష్క్రమణ పూర్తయిన తర్వాత ఈశాన్య గాలులు ప్రవేశించడం మొదలవుతుంది. సహజంగా అక్టోబర్ 25 నాటికి కొన్ని రోజులు అటు ఇటుగా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఈ సమయంలో అండమాన్ నికోబార్ దీవుల పరిసరాల్లో సముద్రంలో అల్ప పీడనాలు ఏర్పడడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తాయి. క్రమేణా వాయు గుండాలు తుపానులుగా మారతాయి. అందుకే ఈ సీజన్ వచ్చిందంటేనే ఆంధ్రా తీరప్రాంతాల్లో వణుకు పుడుతుంది. కారణం ఈ మూడు నెలలో వచ్చే విపత్తులు ప్రాణ, ఆస్తినష్టం తీవ్రంగా ఉంటుందని గత అనుభవాలు చెప్పకనే చెబుతున్నాయి.
బంగాళాఖాతం ఉపరితలంలో గాలి తీవ్రత సాధారణంగా 25 కిలోమీటర్లుగా ఉంటుంది. అల్పపీడనాలు ఏర్పడితే వేగం 35 నుంచి 45 కి.మీ.కు పెరుగుతుంది. అదే వాయుగుండం అయితే 50 నుంచి 60 కిలోమీటర్లకు వేగంగా మారి తీరంవైపునకు పెనుగాలులు వీస్తాయి. ఇలా గాలి వేగం పెరిగే కొద్దీ తీవ్ర తుఫాన్, అతి తీవ్ర తుఫాన్ గా పరిగణిస్తారు. అదే 225 నుంచి 279 కిలోమీటర్ల తీవ్రత ఉంటే 'సూపర్ సైక్లోన్'గా ప్రకటిస్తారు.
హుదూద్ కంటే ముందు అదే తీవ్రతతో పెను తుఫాన్ లు ఓడిశా, ఏపీ తీరాలను దాటి విధ్వంసం సృష్టించాయి. 1977లో దివిసీమ, 1996లో కోనసీమ తుఫాన్....2014 లో హుదూద్ ఇవన్నీ భారీ నష్టాలకు కారణం అయ్యాయి. ఇవన్నీ అక్టోబర్, నవంబర్ లో వచ్చినవే. వీటితో పాటు నీలం, amfan, పైలాన్, టీట్లి, ఇలా చాలా తీవ్ర తుఫాన్లు ఈ సీజన్లో వచ్చాయి.
నైరుతి తర్వాత వచ్చే ఈశాన్య రుతుపవనాలు తూర్పు తీరంపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. అందుకే ఈ సీజన్లో ఎక్కువ విపత్తులు సంభవిస్తూ ఉంటాయి. అయితేను పసిగట్టి అప్రమత్తం చేయగలుగుతున్నామని వాతావరణశాఖ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాడార్, శాటిలైట్ వ్యవస్థ ద్వారా తుఫాన్ హెచ్చరికలను ముందే ఇవ్వ గలుగుతున్నామని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడే విపత్తులు కొంత అయితే మానవ తప్పిదాలతో గ్లోబల్ వార్మింగ్ తో మరింత ముప్పు వాటిల్లుతుంది అని హెచ్చరిస్తున్నారు.
మానవుడు ఆధునికత వైపు ఎన్నిఅడుగులు వేసినా ఆ విపత్తులను ఆపలేరు అనేది నిజం. అందుకే పర్యావరణాన్ని పాడు చేయనీకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గత అనుభవాలు చెప్పకనే చెబుతున్నాయి.