Weather Updates: ఏపీకి తప్పిన తుపాన్ ముప్పు

Weather Updates: భారత్‌పై పెద్దగా ప్రభావం ఉండదని తెలిపిన వాతావరణ శాఖ

Update: 2023-10-25 02:05 GMT

Weather Updates: ఏపీకి తప్పిన తుపాన్ ముప్పు

Weather Updates:  వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన హమూన్ తుపాను అతి తీవ్రమైన తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ సైక్లోనిక్ తుపానుకు ఇరాన్ 'హమూన్' అని పేరు పెట్టింది. 'హమూన్' అనే పదం పర్షియన్ పదం, ఇది లోతట్టు ఎడారి సరస్సులు లేదా చిత్తడి నేలలను సూచిస్తుంది. అవి హెల్మండ్ బేసిన్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో సహజ కాలానుగుణంగా జలాశయాలుగా ఏర్పడతాయి. 65-75 కి.మీ వేగంతో ఈరోజు సాయంత్రం ఖేపుపరా, చిట్టగాంగ్ మధ్య బంగ్లాదేశ్ లో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఈ సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. తుపాను పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు కదులుతున్నందున...ముందే పంట కోతలు పూర్తి చేయాలని భారత వాతావరణ శాఖ రైతులకు సూచించింది. అలాగే తమ పంటలను సురక్షిత ప్రదేశంలో ఉంచుకోవాలని తెలిపింది. తుపాను ప్రభావంతో బెంగాల్ కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News