CM Jagan: ప్రకాశం జిల్లా కొనకనమిట్లలో జగన్ బస్సు యాత్ర
CM Jagan: సంక్షేమాన్ని అడ్డుకునేందుకు మూడు పార్టీలు ఒక్కటయ్యాయి
CM Jagan: సంక్షేమాన్ని అడ్డుకునేందుకు మూడు పార్టీలు ఒక్కటయ్యాయని, పేదల భవిష్యత్తును అడ్డుకునేందుకు కూటమి వస్తోందని ఏపీ సీఎం జగన్ దుయ్యబట్టారు. ప్రజాక్షేమం కోసం తాము.. రాజకీయాల కోసం ప్రత్యర్థులు పనిచేస్తున్నారని అన్నారు. మంచిని కొనసాగించేందుకు చేస్తున్న నినాదమే మేమంతా సిద్ధం అని, పేదల భవిష్యత్తును మార్చే ఎన్నికలివి అని జగన్ అన్నారు. వెన్నుపోటు, మోసం చంద్రబాబు మార్క్ రాజకీయమని,విలువలు, విశ్వసనీయతకు బాబుకు అర్ధం తెలియదన్నారాయన.... పెన్షన్లను ఇంటింటికీ అందకుండా అడ్డుకున్నారని ఆరోపించారు జగన్... జగన్‌కు ఓటేస్తే సంక్షేమం కొనసాగుతుందని, చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమం ముగుస్తుందన్నారు...
జన్మభూమి కమిటీలతో ప్రజలను ఇబ్బంది పెట్టారని, వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందన్నారు జగన్.. పేదలకు జరిగే మంచిని చూడలేని వారే శాడిస్టులని, ఎస్సీలను అవమానించిన చంద్రబాబు శాడిస్టని జగన్ ఆరోపించారు. చంద్రబాబు కంటే పెద్ద శాడిస్ట్ ఎవరూ ఉండరని అన్నారాయన... ప్రజా సంక్షేమాన్ని చూసి... రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని గగ్గోలు పెట్టారని, ఇంటింటికీ సంక్షేమం అందించే వాలంటీర్లను కించ పరిచారని జగన్ ఆరోపించారు. 58 నెలల పాలనలో జగన్ మార్క్ కనిపిస్తోందని, ప్రతీ సంక్షేమ పథకంలో జగన్ కనిపిస్తాడన్నారాయన... చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా అని జగన్ ప్రశ్నించారు.