Nara Bhuvaneshwari: నా బాధను కనకదుర్గమ్మకు చెప్పుకోవడానికి వచ్చా.. ఏపీ ప్రజలకు భువనేశ్వరి పిలుపు..
Nara Bhuvaneshwari: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన భార్య భువనేశ్వరి స్పందించారు.
Nara Bhuvaneshwari: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన భార్య భువనేశ్వరి స్పందించారు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఓ బిడ్డకు మనసు బాగోనప్పుడు.. తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తారు. అలాగే తాను కనకదుర్గమ్మకు నా బాధను చెప్పుకోవడానికి వచ్చానన్నారు. నా భర్త చంద్రబాబును రక్షించమని... ఆయనకు మనో ధైర్యం ఇవ్వాలని వేడుకున్నానని భువనేశ్వరి తెలిపారు. చంద్రబాబు పోరాటం ఆయన ఒక్కరి కోసమో, ఆయన కుటుంబం కోసమో కాదని.. ఆయన పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం, హక్కుల కోసమన్నారు. తాను ఒక్కటే కోరుతున్నా... మీ అందరి కోసం చంద్రబాబు చేస్తున్న పోరాటం దిగ్విజయం కావడానికి అందరూ చేయిచేయి కలపాలన్నారు భువనేశ్వరి.