Anandayya Natu Mandu: ఫలించని సీసీఆర్ఏఎస్ పరిశోధనలు

Anandayya Natu Mandu: ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్ పరిశోధనలు ఫలించడం లేదు.

Update: 2021-05-26 05:32 GMT
CCRAS Researches Fruitful ON Anandayya Natu Mandu

Anandayya Natu Mandu: ఫలించని సీసీఆర్ఏఎస్ పరిశోధనలు

  • whatsapp icon

Anandayya Natu Mandu: ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్ పరిశోధనలు ఫలించడం లేదు. ఆయుర్వేద వైద్యులు రెండు రోజులుగా పరిశోధనల కోసం ప్రయత్నిస్తున్నా ఇప్పటివరకు అధ్యయనంలో ముందడుగు పడలేదు. అడుగడుగునా అవరోధాలే ఎదురవడంతో పరిశోధనకు మరింత సమయం పట్టే అవకాశాలున్నాయి.

రెండ్రోజుల అధ్యయనంలో 500 మంది నెంబర్లకు ఫోన్లు చేసిన ఆయర్వేద వైద్యులకు ట్విస్టుల మీద ట్విస్టులు ఎదురయ్యాయి. లిస్టులో ఉన్న 36 మంది రోగులు ఒకే నెంబర్ ఇచ్చారు. కొందరు ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్ల నంబర్లు ఇవ్వగా అసలు మందే తీసుకోలేదని 42 మంది చెప్పారు. ఇలా ఫోన్లలో ఎవరూ సరిగా అందుబాటులోకి రాకపోవడంతో అధ్యయనంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో మరిన్ని నెంబర్లు పంపాలని నెల్లూరు అధికారులను కోరారు వైద్యులు.

Tags:    

Similar News