Avinash Reddy: తెలంగాణ హై కోర్టును ఆశ్రయించిన అవినాష్‌రెడ్డి

Avinash Reddy: న్యాయవాది సమక్షంలో విచారించాలంటూ పిటిషన్

Update: 2023-03-10 02:52 GMT

Avinash Reddy: తెలంగాణ హై కోర్టును ఆశ్రయించిన అవినాష్‌రెడ్డి

Avinash Reddy: వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు కొనసాగిస్తోంది. ఈ కేసులో మరిన్ని అరెస్ట్ లు ఉండబోతున్నాయన్న ప్రచారం ఓ వైపు జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో అవినాష్ రెడ్డిని శుక్రవారం మరోసారి విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీసులు పంపిన నేపథ్యంలో అవినాష్ రెడ్డి తెలంగాణ హై కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. సీబీఐ తనను విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయాలని తన న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలని ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని పిటిషన్‌లో ఆయన విజ్ఞప్తి చేశారు.

వివేకా హత్య కేసులో ఏ4గా నిందితుడిగా ఉన్న దస్తగిరిని ఇప్పటివరకు సీబీఐ అరెస్ట్‌ చేయలేదని, దస్తగిరి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కూడా సీబీఐ ఎక్కడా వ్యతిరేకించలేదని అవినాష్ రెడ్డి కోర్టుకు నివేదించారు. తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ ఈ కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందన్నారు. దస్తగిరి అక్కడ ఇక్కడ విని చెప్పిన మాటల ఆధారంగానే సీబీఐ విచారణ కొనసాగుతోందన్నారు. తాను విచారణలో చెప్పిన విషయాలను కూడా విచారణ అధికారి మార్చేస్తున్నారని, దర్యాప్తు అధికారి పనితీరు పక్షపాతంగా ఉందని ఎంపీ అవినాష్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ కేసులో నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ సందర్భంగా సీబీఐ తన కౌంటర్ పిటిషన్ లో పేర్కొన్న అంశాలు సంచలనం సృష్టించాయి. వివేకా హత్య కు సంబంధించిన కుట్ర అవినాష్ రెడ్డి అతడి తండ్రి భాస్కర్ రెడ్డి లకు ముందే తెలుసని సీబీఐ ఆరోపిస్తోంది. గూగుల్ టేక్ ఓవర్ ద్వారా నిందితులు హత్యకు ముందు భాస్కర్ రెడ్డి నివాసంలోనే ఉన్నట్టు తేలిందని సీబీఐ తెలిపింది. దీంతో సీబీఐ ఈ కేసులో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇక ఇదే టైం లో అవినాష్ రెడ్డి ని శుక్రవారం మరోసారి విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నోటీసులు ఇవ్వడం ..అవినాష్ రెడ్డి సీబీఐ ముందస్తు చర్యలకు సిద్దపడకుండా ఆదేశించాలని కోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత ను సంతరించుకుంది. 

Tags:    

Similar News