AP Rains: ఏపీకి మరో గండం..5,6 తేదీల్లో మరో అల్పపీడనం

Rains : ఏపీకి మరో గండం పొంచిఉంది.వచ్చే రెండు మూడు రోజుల్లో క్రుష్ణానదికి వరద ప్రవాహం మళ్లీ పెరిగే ఛాన్స్ ఉంది. ద్రోణి ప్రభావంతో మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2024-09-03 01:17 GMT

Rain Alert: బిగ్ అలర్ట్..తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు..ఐఎండీ వార్నింగ్

AP Rains: రానున్న రెండు, మూడు రోజుల్లో క్రుష్ణానదికి వరద ప్రవాహం మళ్లీ పెరిగే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ద్రోణి ప్రభావంతో మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే క్రుష్ణా పరీవాహకప్రాంతాంలోని ప్రాజెక్టులన్నీనిండుకుండలుగా మారడంతో..వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేయాలి. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలకు వరద పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

సోమవారం సాయంత్రం వరకు శ్రీశైలం ప్రాజెక్టుకు 5.29లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా..5.55లక్షలక్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ కు 4.68లక్షల క్యూసెక్కులు వస్తుండగా..5.41లక్షల క్యూసెక్కులు విడుదల అవుతున్నాయి. పులిచింతల ప్రాజెక్టు దగ్గర 5.48లక్షలక్యూసెక్కుల ఇన్ ఫ్లూ 5.44 లక్షల ఔట్ ఫ్లూ నమోదు అవుతుంది. మంగళ, బుధవారాల్లో మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద సోమవారం గరిష్టంగా 11.43లక్షల క్యూసెక్కులకు చేరింది. అంతేస్థాయిలో దిగువకు వదిలారు. సాయంత్రం వరకు తగ్గుముఖం పట్టింది. ఈనెల 5,6 తేదీల్లో బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్ ప్రాంతాంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఇది తుఫాన్ గా మారి విశాఖ, ఒడిశా దిశగా ప్రయాణించి తీరందాటే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. మంగళ, బుధవారాల్లో దీనిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. వాయుగుండం ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా తెరుకోకముందే మరో అల్పపీడనం ఏర్పడనుందనే సమాచారం ముంపు ప్రాంతాల ప్రజలను మరింత ఆందోళన కలిగిస్తోంది.

Tags:    

Similar News