Chandrababu: చంద్రబాబుకు కోర్టు విధించిన షరతులు ఇవే..

Chandrababu: రూ.లక్ష పూచీకత్తు, రెండు ష్యూరిటీలతో బెయిల్‌ మంజూరు

Update: 2023-10-31 06:34 GMT
AP High Court Conditions for Chandrababu in Interim Bail

Chandrababu: చంద్రబాబుకు కోర్టు విధించిన షరతులు ఇవే..

  • whatsapp icon

Chandrababu: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు పలు షరతులు విధించింది. లక్ష పూచీకత్తు, రెండు ష్యూరిటీలతో బెయిల్‌ మంజూరు చేసింది. చంద్రబాబు ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని.. కేసుకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేయకూడదని కోర్టు తెలిపింది. అనారోగ్య కారణాలతో మంజూరు చేసినందువల్ల.. ఇల్లు, ఆస్పత్రికి మాత్రమే పరిమితం కావాలని తీర్పునిచ్చింది. చంద్రబాబుతో ఇద్దరు డీఎస్పీలను ఎస్కా్ర్ట్‌గా ఉంచాలన్న ప్రభుత్వ అభ్యర్థనపై కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు సూచించింది. జెడ్ ప్లస్ భద్రతపై కేంద్ర నిబంధనల మేరకు అమలు చేయాలని చెప్పింది. చంద్రబాబు భద్రత అంశంలో జోక్యం చేసుకోమని కోర్టు తెలిపింది.

Tags:    

Similar News