ఏపీలో కొత్తగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ ‌జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది..

Update: 2020-10-16 11:00 GMT

 ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ ‌జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బీసీ కులాల జనాభా ప్రాతిపదికన గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎక్కువ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. 139 బీసీ కులాలకు వెనుకబడిన తరగతుల శాఖ కొత్తగా 56 బీసీ కార్పొరేషన్లును ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం 2001 ప్రకారం బీసీ కులాల కార్పొరేషన్ల ఏర్పాటు చేస్తూ వేర్వేరు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

పది లక్షలకు పైన జనాభా ఉన్న కార్పొరేషన్‌లను 'ఏ' కేటగిరీ కింద, లక్ష నుంచి పది లక్షల వరకు జనాభా ఉన్న కార్పొరేషన్‌లను 'బి' కేటగిరీ కింద, లక్షలోపు జనాభా ఉన్న కార్పొరేషన్‌లను 'సి' కేటగిరీగా విభజించారు. జిల్లాలకు ప్రాతినిధ్యం వహించేలా ప్రతి కార్పొరేషన్‌లోనూ 13 మంది డైరెక్టర్లను నియమిస్తామని పేర్కొంది. ఇక ఈనెల 18న ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించనున్నారు.  

Tags:    

Similar News