Rice Home Delivery In AP: ఏపీలో బియ్యం డోర్ డెలివరీ! జగన్ సర్కార్ కీలక నిర్ణయం
Rice Home Delivery In AP: ఆంధ్రప్రదేశ్‌లో నాణ్యమైన బియాన్ని డోర్ డెలివరీ చేయాలని జగన్ సర్కార్ యోచిస్తుంది. అదే తరుణంలో ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించేలా.. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ , ఈబిసి యువతకు స్వయం ఉపాధి
Rice Home Delivery In AP: ఆంధ్రప్రదేశ్‌లో నాణ్యమైన బియాన్ని డోర్ డెలివరీ చేయాలని జగన్ సర్కార్ యోచిస్తుంది. అదే తరుణంలో ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించేలా.. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ , ఈబిసి యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. వెనుక బడిన వర్గాలకు వాహనం కొనుగోలు చేసే విధంగా రుణ సౌకర్యం కల్పించనుంది. దీనివల్ల నేరుగా సుమారుగా వెయ్యి మంది వరకు లబ్ధిదారులకు జీవనోపాధి కలగనుంది.
ఏపీ సర్కార్. ఆర్థిక భారం తగ్గించే దిశగా 9260 వాహనాలు ప్రవేశ పెట్టేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి మండలి నిర్ణయం మేరకు స్వయం ఉపాధి పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ మరియు ఈబిసి యువతకు అవకాశం కల్పించనుంది. వాహనాలు కొనుగోలుకు 60 శాతం సబ్సిడీ, 30 శాతం లోన్ అందించనుంది.
లోన్ తిరిగి చెల్లించేందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హామీ ఇచ్చింది. ఆరు సంవత్సరాలు పాటు లోన్, అనంతరం లబ్దిదారుల పేరుతో వాహనం అందిస్తారు. వాహనాల సబ్సిడి కోసం 331 కోట్లు లోన్ తీసుకునేందుకు సివిల్ సప్లైస్ కార్పోరేషన్ కు అనుమతి ఇచ్చారు. బియ్యం డోర్ డెలివరీ కి ప్రతి ఏడాది 776. 45 కోట్ల రూపాయలు అదనపు నిధులు మంజూరు చేయనున్నారు....