AP Schools: ఏపీలో ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్
AP Schools: ఆంధ్రప్రదేశ్‌లో ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇవ్వనున్నారు.
AP Schools: ఆంధ్రప్రదేశ్‌లో ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇవ్వనున్నారు. గతంలో వచ్చిన రిజల్ట్స్, మౌలిక వసతుల ఆధారంగా రేటింగ్ ఇవ్వనున్నారు. జీరో నుంచి ఫైవ్ వరకు స్టార్ రేటింగ్ ఇవ్వనున్నారు.
రేటింగ్ తగ్గిన స్కూల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. అన్ని స్కూళ్లను ఫైవ్ రేటింగ్ తెచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తెచ్చే ప్రయత్నంలో భాగంగా రేటింగ్ ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.