ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల.. ఫలితాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

Update: 2020-10-10 05:09 GMT

ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఇంజనీరింగుకు లక్షా 56 వేల 953మంది విద్యార్థులు హాజరు అయ్యారు.. ఇందులో లక్షా 33 వేల 66 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే 84.78 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 79 వేల 30 మంది ఉన్నారు.. బాలికలు 54 వేల 36 మంది వున్నారు. అలాగే వ్యవసాయం, ఫార్మసీకి 75 వేల 834 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 69 వేల 616 మంది విద్యార్థులు అర్హత సాధించారు. అంటే 91 . 77 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

బాలురు 22 వేల 420 మంది ఉన్నారు.. బాలికలు 47 వేల 196 మంది బాలికలు ఉన్నారు. కరోనా కారణంగా హాజరు కాలేకపోయిన 97 మందికి వచ్చే బుధవారం పరీక్ష నిర్వహించనున్నారు.ఇక ఎంసెట్ పరీక్షలు చాలా పారదర్శకంగా నిర్వహించామని.. ఎక్కడా ఎటువంటి తప్పులు జరగలేదని మంత్రి సురేష్ అన్నారు.ఇదిలావుంటే ఆన్‌లైన్‌ (సీబీటీ) విధానంలో జరిగిన ఈ పరీక్షలను హైదరాబాద్‌తో పాటు ఏపీలోని మొత్తం 47 నగరాల్లో 118 కేంద్రాల్లో నిర్వహించారు. గత నెల సెప్టెంబర్‌ 17వ తేదీ నుంచి 25 వరకు ఉదయం, మధ్యాహ్నం మొత్తం 14 సెషన్లలో పరీక్షలు జరిగాయి. 

 

 

Tags:    

Similar News