CS Nirab Kumar: జులై 1న ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ

NTR Bharosa pensions: సామాజిక భద్రతా పింఛన్లను జూలై 1న పింఛనుదారుల ఇంటి వద్దే పంపిణీ చేయడానికి పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు.

Update: 2024-06-28 05:49 GMT

CS Nirab Kumar: జులై 1న ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ

CS Nirab Kumar Prasad: సామాజిక భద్రతా పింఛన్లను జూలై 1న పింఛనుదారుల ఇంటి వద్దే పంపిణీ చేయడానికి పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65లక్షలా18వేల 496 మంది పింఛనుదారులకు 4వేల 399.89 కోట్లను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పింఛన్లు ఒక్కరోజులోనే పంపిణీ చేయించాలని సూచించారు.

అనివార్య కారణాల వల్ల ఇంకా ఎవరన్నా మిగిలిపోయి ఉంటే రెండోరోజు కూడా పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. వృద్ధులు, వితంతువులు తదితర 11 ఉప విభాగాలకు చెందినవారి పింఛను 3వేల నుంచి 4వేలకు పెంచిన నేపథ్యంలో 1వ తేదీన 4 వేలతో పాటు ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన ఎరియర్స్‌ కలుపుకుని మొత్తం 7వేలు పంపిణీ చేయాలని ఆదేశించారు.

Tags:    

Similar News