CM Chandrababu: హర్యానాకు ఏపీ సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు హర్యానాలో పర్యటించనున్నారు. నయాబ్ సింగ్ సైనీ హర్యానా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.

Update: 2024-10-17 04:42 GMT

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు కీలక సమావేశం.. పార్టీ ఎమ్మెల్యేలు చేస్తోన్న తప్పిదాలపై వార్నింగ్

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు హర్యానాలో పర్యటించనున్నారు. నయాబ్ సింగ్ సైనీ హర్యానా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఆయన ఆహ్వానం మేరకు ఈ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హజరుకానున్నారు. కాసేపట్లో విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి..11 గంటలకు చంద్రబాబు చంఢీఘర్ చేరుకుంటారు. 12 గంటల నుంచి 2 గంటల మధ్య పంచకుల, సెక్టార్ 5లోని దసరా గ్రౌండ్‌కు సీఎం చంద్రబాబు వెళతారు. అక్కడ నయాబ్ సింగ్ సెనీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు.

అనంతరం సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 7 గంటల వరకూ నిర్వహించే మీటింగ్‌లో పాల్గొంటారు. తర్వాత రాత్రి 10 గంటలకు అక్కడి నుంచి సీఎం చంద్రబాబు బయలుదేరి విజయవాడకు వస్తారు. కాగా హర్యానా కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అగ్రనేతలు, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయాన్ని సాధించిన BJP కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ మొత్తం 90 సీట్లలో 48 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 37 సీట్లకే పరిమితమైంది. ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు ఇండిపెండెంట్లు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీకి మద్దతు ప్రకటించారు.

Tags:    

Similar News