AP Cabinet: ముగిసిన AP కేబినెట్ భేటీ.. చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయాలు ఇవే..!

AP Cabinet: మూడున్నర గంటల పాటు కొనసాగిన భేటీ

Update: 2024-06-24 09:02 GMT

AP Cabinet: ముగిసిన AP కేబినెట్ భేటీ.. చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయాలు ఇవే..!

AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. మూడున్నర గంటల పాటు సమావేశం జరిగింది. చంద్రబాబు చేసిన 5 సంతకాల ఫైల్స్‌కు కేబినెట్ ఆమోదం లభించింది. మెగా డీఎస్సీ నిర్వహణ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు..అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, సామాజిక పెన్షన్ల పెంపు, స్కిల్ సెన్సెస్ కార్యక్రమాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరును.. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా మార్చింది కేబినెట్.

ఇక భేటీ ముగిసినా మంత్రులతో చంద్రబాబు సమావేశం కొనసాగుతుంది. తొలి కేబినెట్ కావడంతో.. మంత్రులకు సీఎం దిశా నిర్దేశం చేస్తున్నారు. శాఖలవారీగా ఎలా ముందుకెళ్లాలన్నదానిపై మంత్రులకు సూచనలు చేస్తున్నారు. శాఖలవారిగా శ్వేతపత్రాల విడుదలకు మంత్రులకు సూచిస్తున్నారు. శాఖలపై పట్టుసాధించాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ.. శాఖలకు మంచిపేరు తీసుకురావాలన్నారు సీఎం చంద్రబాబు.

Tags:    

Similar News