అధికార, ప్రతిపక్షాల మాటల తూటాలతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఇవాళ నాలుగో రోజు సభలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ, ఆరోగ్య శ్రీ, ఎస్సీ - ఎస్టీ, బీసీ మైనారిటీ సంక్షేమంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. అలాగే పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ల్యాండ్ టైటిలింగ్ బిల్లుతో పాటు దిశ బిల్లు, మున్సిపల్ చట్టం, ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లులను సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.