హెలికాప్టర్‌లో హైద‌రాబాద్‌కు మంత్రి వెల్లంప‌ల్లి.. అపోలోలో చికిత్స‌..

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు ఇటీవల కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు ఇంకా కరోనా నెగటివ్ రాలేదు.. దీంతో ఆయన్ను..

Update: 2020-10-15 03:26 GMT

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు ఇటీవల కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు ఇంకా కరోనా నెగటివ్ రాలేదు.. దీంతో ఆయన్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. గత రెండు రోజులుగా జ్వరంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌.. బాగా నీరసంగా ఉండటంతో చికిత్స నిమిత్తం అపోలోలో చేరారు.. ఇక‌, భారీ వ‌ర్షాల‌తో రోడ్డుమార్గం అంతగా అనుకూలంగా లేక‌పోవ‌డంతో.. విజ‌య‌వాడ నుంచి హైద‌రాబాద్‌కు మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌ ప్రత్యేక హెలీకాప్ట‌ర్‌లో వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 28వ తేదీన వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది.

అయితే అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతున్నా.. తగిన జాగ్రత్తలు తీసుకున్నా కరోనా తగ్గలేదు. కాగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు వెల్లంపల్లి. ప్రజారాజ్యం పార్టీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వెల్లంపల్లి ఆ తరువాత బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి జలీల్ ఖాన్ చేతిలో ఓడిపోయారు. అయితే జలీల్ ఖాన్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ చేరడంతో.. బీజేపీలో ఉన్న వెల్లంపల్లి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో జలీల్ ఖాన్ కూతురు పై గెలుపొందారు. అనంతరం రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక వెల్లంపల్లి ఆరోగ్య పరిస్థితిపై సీఎంఓ ఆరాతీసినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు వెల్లంపల్లి ఫోన్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.  

Tags:    

Similar News