Roja Comments on Nara Lokesh: లోకేష్ పనిపాట లేకుండా ఇంట్లో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకొంటున్నాడు

Roja Comments on Nara Lokesh: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీఐఐసీ చైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు.

Update: 2020-06-28 03:59 GMT
RK Roja (File Photo)

Roja Comments on Nara Lokesh: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీఐఐసీ చైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఖజానాకి మూడున్నర లక్షల కోట్లు అప్పు ఉంచి వెళ్ళారని, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కూడా ప్రజలను క్లిష్టమైన సమయంలో సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా ఆదుకున్నారని రోజా అన్నారు. ఆదివారం ఆమె తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి కారణంగా శ్రీవారిని భౌతిక దూరం పాటిస్తూ దర్శించుకున్నానని తెలిపారు. కరోనా టెస్తుల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌ అన్ని రాష్ట్రాల కన్నా ముందు ఉందన్నారు. కరోనా చికిత్సను వైసీపీ ప్రభుత్వం 'ఆరోగ్యశ్రీ' కిందకి తీసుకొచ్చిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా చికిత్సకి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఎంతో మంది ప్రాణాలను కాపాడారని రోజా పేర్కొన్నారు.

చంద్రబాబుకి అధికారం, అవినీతి డబ్బు కావాలి తప్ప, ప్రజలపై మమకారం లేదని, చంద్రబాబు నైజం ఏమిటో ప్రజలందరికి తెలిసిందన్నారు. నారా లోకేష్‌ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తండ్రి 13 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిందిపోయి. తాము బతికుంటే చాలు అన్నట్లు తండ్రీకొడుకులు వ్యవహరించారని అన్నారు. టీడీపీలో ఉన్న అవినీతి గద్దలు సాక్ష్యాలతో సహా దొరికి అరెస్ట్‌ అయితే వారి కోసం హైదరాబాద్‌ నుంచి వచ్చారంటూ'' రోజా మండిపడ్డారు.

లోకేష్ పని పాట లేకుండా పబ్జీ గేమ్ ఆడుకొంటున్నాడని ఎద్దేవా చేశారు. లోకేశ్ ను మంగళగిరిలో ప్రజలు ఎంత దారుణంగా ఓడించారో చూశామని, ఒక ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్.. 151 సీట్లతో తిరుగులేని ఆధిక్యతతో నాయకుడిగా ఎదిగిన వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని రోజా అన్నారు. దేశంలోనే బెస్ట్ సీఎంగా వైఎస్‌ జగన్‌ నాలుగో స్థానంలో ఉన్నారని గుర్తు చేశారు. రాజకీయాలపై లోకేష్‌ అవగాహన తెచ్చుకోవాలంటూ రోజా హితవు పలికారు.


Tags:    

Similar News