108,104 Employees salaries Hike in AP: 108 సిబ్బందికి జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. జీతాలు భారీగా పెంపు
108,104 Employees salaries Hike in AP: ఆంధ్రప్రదేశ్ 108 సిబ్బందికి జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో అంబులెన్స్ వ్యవస్థ మళ్లీ ప్రాణం పోసుకుంది.
108,104 Employees salaries Hike in AP: ఆంధ్రప్రదేశ్ 108 సిబ్బందికి జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో అంబులెన్స్ వ్యవస్థ మళ్లీ ప్రాణం పోసుకుంది. లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన ఈ అంబులెన్స్ వ్యవస్థను మళ్లీ బతికించాలన్న ఉద్దేశంతో సర్కారు నడుం బిగించింది. ఇవాళ ఈ కొత్త వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఒకేసారి ఏకంగా 1,088 వాహనాలను (108–104 కలిపి) బుధవారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ బెంజ్ సర్కిల్‌లో జెండా ఊపి ప్రారంభించారు
కాగా.. ప్రజారోగ్య రంగంలో అత్యవసర సేవలు అందిస్తున్న 108 సిబ్బందికి జీతాలు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. 108 అంబులెన్స్ ల డ్రైవర్ల జీతాన్ని ప్రస్తుత 10 వేల రూపాయల నుంచి సర్వీసును బట్టి 18 వేల రూపాయలు 20 వేల రూపాయలు వరకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇక ఎమర్జన్సీ మెడికల్ టెక్నీషియన్ల జీతాలను ప్రస్తుత 12 వేల రూపాయల నుంచి సర్వీసును బట్టి 20 వేల రూపాయలు నుంచి 30 వేల రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటించారు.
అంతకుముందు గుంటూరు జీజీహెచ్ లోని నాట్కో కేన్సర్ బ్లాక్ ను సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 108 సిబ్బంది జీతాలను పెంచబోతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా నాట్కో కేన్సర్ బ్లాక్ ను ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడుతూ.. మెడికల్ టెక్నీషియన్ల జీతాలను 20 వేల రూపాయలు నుంచి 30 వేల రూపాయల వరకు పెంచుతున్నట్టు ప్రకటించారు. సీఎం చేసిన ప్రకటనతో 108 సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
203 కోట్ల ఖర్చుతో ఒక వెయ్యి 88 108, 104 వాహనాలను కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒక 108, 104 వాహనాలు అందుబాటులో ఉంచనున్నారు. ఎక్కడైన ప్రమాదం అని ఫోన్ వచ్చిన 15, 20 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకోనున్నాయి ఈ వాహనాలు. ప్రతి అంబులెన్సును ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్‌తో అనుసంధానం చేయడం ద్వారా ఫోన్ చేసిన వారిని వేగంగా ట్రాక్ చేసే వీలు ఉంటుంది. అంతేకాదు ప్రతి అంబులెన్సులోనూ ఒక కెమెరా, ఒక మొబైల్ డేటా టెర్మినల్, రెండు వైపులా మాట్లాడుకునే విధంగా ఆటోమేటిక్ వెహికిల్ లొకేషన్ టాండ్ బాక్స్‌ను ఏర్పాటు చేశారు.
కొత్తగా సిద్ధంగా ఉన్న 412 అంబులెన్సులలో 282 బేసిక్ లైఫ్ సపోర్టుకు సంబంధించినవి. 104 వాహనాలను అడ్వాన్స్ లైఫ్ సపోర్టుతో తీర్చి దిద్దారు. మరో 26 అంబులెన్సులను చిన్నారులకు వైద్య సేవలందించేలా తయారు చేశారు. ఈ వాహనాల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. బీఎల్‌ఎస్ అంబులెన్సులలో స్పైన్ బోర్డు, స్కూప్ స్ట్రెచర్, వీల్ చైర్, బ్యాగ్ మస్క్, మల్టీపారా మానిటర్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఏఎల్‌ఎస్ అంబులెన్సులలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో వైద్య సేవలందించేలా లెటెస్ట్ టెక్నాలజీతో కూడిన వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. ఇటు చిన్నారులకు వైద్యం అందించే నియోనేటల్ కేర్ అంబులెన్సులలో ఇన్‌క్యుబేటర్లతో పాటు వెంటిలేటర్లను తీర్చిదిద్దారు.