AP Liquor Shops Tenders: ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. మద్యం టెండర్లలో షెడ్యూల్ లో మార్పులు

AP Liquor Shops Tenders: రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తుల స్వీకరణకు మరో రెండు రోజులు గడువున పొడిగించింది.

Update: 2024-10-09 05:51 GMT

AP Liquor Shops Tenders

AP Liquor Shops Tenders: రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తుల స్వీకరణకు మరో రెండు రోజులు గడువున పొడిగించింది. మొదట జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం నిన్నటితో గడువు ముగిసింది. ఈనెల 11 వ తేదీ సాయంత్రం వరకు గడువు పెంచారు. 14వ తేదీన లాటరీ తీసి లైసెన్సులు ఇవ్వనున్నారు. 16వ తేదీ నుంచి కొత్త లైసెన్స్ దారులు దుకాణాలు ప్రారంభించనున్నారు. అదే రోజు నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానున్నాయి.

మొత్తం 3,390 దుకాణాలకు లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ జారి చేసింది ప్రభుత్వం. రాత్రి తొమ్మిది గంటల వరకు 41 వేల 348 దరఖాస్తులు వచ్చాయి. మనాన్ రిఫండబుల్ ఫీజు రూపంలో 826.96 కోట్ల ఆదాయం వచ్చినట్టు ప్రకటించారు. గడువు పొడిగింపు నేపథ్యంలో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తిరుపతి, విశాఖ పట్నం, పొట్టి శ్రీరారములు నెల్లూరు, అనకాపల్లి, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో నోటిఫై చేసిన దుకాణాల సంఖ్యతో పోలిస్తే వచ్చిన దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉంది.  

Tags:    

Similar News