TTD Chairman: టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు నియామకం
TTD Chairman: చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీఆర్ నాయుడు ను చైర్మన్ గా నియమించారు
TTD Chairman: టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడును నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీఆర్ నాయుడు ను చైర్మన్ గా నియమించారు. టీటీడీ సభ్యులుగా తెలంగాణ నుంచి ఐదుగురు,కర్ణాటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచిఇద్దరు, గుజరాత్, మహారాష్ట్రల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చారు.
టీటీడీ సభ్యులు వీరే
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజు, సభ్యులుగా పనబాక లక్ష్మి, నర్సిరెడ్డి, సాంబశివరావు, నన్నపనేని సదాశివరావు, కృష్ణమూర్తి, కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, జంగా కృష్ణమూర్తి,ఆర్ఎన్, దర్శన్, జస్టిస్ హెచ్ఎల్ దత్,శాంతారాం, పి. రామ్మూర్తి, తమ్మిశెట్టి జానకిదేవి, బి.మహేందర్ రెడ్డి, ఎం. రంగశ్రీ,బి. ఆనందసాయి, ఎల్ల.సుచిత్ర, డాక్టర్ అదిత్ దేశాయ్, సౌరబ్ హెచ్.బోరలను నియమించారు.
తెలంగాణ నుంచి నన్నూరి నర్సిరెడ్డి, బూంగునూరు మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, బూరగాపు ఆనందసాయి, సుచిత్ర ఎల్లకు చోటు కల్పించారు. కర్ణాటక నుంచి నరేష్ కుమార్, దర్శన్ ఆర్ఎన్, జస్టిస్ హెచ్ ఎల్ దత్, తమిళనాడు నుంచి కృష్ణమూర్తి, పి.రామ్మూర్తి, డాక్టర్ అదిత్ దేశాయ్ గుజరాత్ నుంచి, మహారాష్ట్ర నుంచి సౌరభ్ హెచ్ బోరాలకు అవకాశం దక్కింది.