AP Government: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. త్వరలోనే డీఎస్సీ 2020
AP Government: డీఎస్సీ 2018 ప్రక్రియను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం.. త్వరలోనే స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలను భర్తీ చేయనుంది.
AP Government: డీఎస్సీ 2018 ప్రక్రియను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం.. త్వరలోనే స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలను భర్తీ చేయనుంది. అలాగే ఈ భర్తీ ప్రక్రియ పూర్తయ్యాక.. డీఎస్సీ 2020 నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. టేట్ సిలబస్ ను విద్యార్ధుల అవసరాల మేరకు మారుస్తామని.. ఇంటర్ విద్యలో ప్రాదమిక విషయాలు వదలకుండా సిలబస్ కుదించే ప్రయత్నం చేస్తున్నారు. అటు త్వరలోనే ఉపాద్యాయుల బదిలీలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇదిలా ఉంటే న్యాయ వివాదాలతో నిలిచిన 2018 డీఎస్సీ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల భర్తీకి మంత్రి షెడ్యూల్ ప్రకటించారు. ఇంకా 1,321 మంది ధ్రువపత్రాలను పరిశీలన చేయాల్సి ఉంది. బుధవారం ఈ పోస్టులకు అర్హత సాధించిన వారి మొబైల్ నెంబర్లకు మెసేజ్ పంపిస్తారు..
తర్వాత తమ ధ్రువపత్రాలను సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎంపికైనవారు ఈనెల 24న ఆయా జిల్లాల విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలి. అదే రోజు ఆయా జిల్లాల్లోని 3, 4 కేటగిరీలు, ఇతర మారుమూల ప్రాంతాల్లోని స్కూళ్లలోని ఖాళీల జాబితాను డీఈవో ఆఫీస్ పోర్టళ్లలో ఉంచుతారు. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 25, 26 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించి అదే రోజున నియామక ఉత్తర్వులు అందిస్తారు. ఈనెల 28న తమకు కేటాయించిన స్కూళ్లలో చేరాల్సి ఉంటుంది.