Andhra Pradesh: ఏపీ కేబినేట్‌ సమావేశానికి ముహూర్తం ఫిక్స్

Update: 2021-02-18 14:17 GMT

కాబినెట్ మీటింగ్ (ఫైల్ ఇమేజ్ ది హన్స్ ఇండియా)

Andhra Pradesh: ఏపీ కేబినేట్‌ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 23న అమరావతి సచివాలయం మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో మంత్రివర్గం సమావేశం కానుంది. బడ్జెట్ సమావేశాలు, స్టీల్‌ ప్లాంట్‌ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. అలాగే పలు కీలక అంశాలపై కేబినెట్ భేటీలో ప్రస్తావించనున్నారు.

ఈ నెల 23న ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, సంక్షేమ పథకాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ అజెండాగా క్యాబినెట్ జరుగనుంది. దీంతో పాటు ప్రస్తుతమున్న పంచాయతీ ఎన్నికలు. మున్సిపల్ ఎన్నికలపై చర్చకు అవకాశముంది.

ఏపీలో వచ్చే నెల 10న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. వీటి ప్రభావం బడ్జెట్ సమావేశాలపై పడే అవకాశముంది. ఒక వేళ ఎన్నికలు జరిగే సమయంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తే... పరిస్థితి ఎంటనే దానిపై కూడా చర్చించనున్నారు.

వచ్చే నెల 31 లోపు 2021 - 22 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రవేశ పెట్టాలి. అయితే. ప్రస్తుతం ఏపీలో స్థానిక ఎన్నికల హడావిడి నడుస్తోంది. దీనికి తోడు మున్సిపల్ ఎన్నికలు కూడా వచ్చాయి. బడ్జెట్ సమావేశాలు నిర్వహించకపోతే ఆర్డినెన్స్ తీసుకునే అవకాశముంది.

సాధారణంగా బడ్జెట్ సమావేశాలు మార్చి మొదటి వారంలో ప్రారంభమవుతాయి. కానీ మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి. ఎమ్మెల్యేలు. మంత్రులు అందరూ మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉంటారు. మార్చి 14న ఫలితాలు విడుదలవుతాయి. ఇక మార్చి 15 తర్వాత బడ్జెట్ సమావేశాలు పెట్టే అవకాశముంది. మరోవైపు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలను సమావేశంలో సమీక్షించే అవకాశం ఉంది.  

Tags:    

Similar News