Pushpa 2 Success Meet: ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని మరీమరి 'అభినందించిన' అల్లు అర్జున్

Allu Arjun speech in Pushpa 2 movie success meet: పుష్ప 2 సక్సెస్ మీట్ లో అందరికీ థాంక్స్ చెబుతూ అల్లు అర్జున్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Update: 2024-12-08 00:30 GMT

Allu Arjun speech in Pushpa 2 movie success meet: పుష్ప 2 మూవీ హిట్ అయిందనే సంతోషంలో ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం ఆ సంబరాల్లో మునిగి తేలుతున్నాడు. అందులో భాగంగానే పుష్ప చిత్ర నిర్మాతలు శనివారం రాత్రి పుష్ప 2 మూవీ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

పుష్ప 2 సక్సెస్ మీట్ లో అందరికీ థాంక్స్ చెబుతూ అల్లు అర్జున్ ప్రసంగం కొనసాగింది. అల్లు అర్జున్ ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలియాలంటే ఈ వేడుకలో ఆయన మాట్లాడిన ఆ స్పీచ్ వినాల్సిందే.

ఈ ప్రోగ్రాంలో అల్లు అర్జున్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యమైనవి నాలుగు అంశాలు ఉన్నాయి.

1) ఐకాన్ స్టార్ కు గుర్తుకురాని ముఖ్యమంత్రి పేరు

పుష్ప 2 మూవీ సక్సెస్ అయ్యేందుకు తెలంగాణ సర్కారు తమకు ఎంతో సహకరించిందంటూ ప్రభుత్వానికి అల్లు అర్జున్ థాంక్స్ చెప్పుకున్నారు. అయితే, ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి పేరు చెప్పే క్రమంలో అల్లు అర్జున్ ఏదో వెతుక్కున్నట్లు అటు ఇటు దిక్కులు చూశారు. ఈ దృశ్యాన్ని లైవ్లో చూసిన ఆడియెన్స్, అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పేరు మార్చిపోయాడని అంటున్నారు. అందుకే ఆయన తడబడ్డట్లుగా చెప్పుకుంటున్నారు.

అయితే, ఈ విషయంలో పుష్ప రాజ్ వెర్షన్ మాత్రం వేరేగా ఉంది. మాట్లాడుతూ మాట్లాడుతూ గొంతు పొరబోయిందని, అందుకే వెంటనే మాట రాలేదని చెప్పారు. అసిస్టెంట్స్ నుండి నీళ్ళ బాటిల్ తీసుకుని లైట్ గా జస్ట్ ఒక్కటంటే ఒక్క సిప్ చేసి, మళ్లీ స్పీచ్ కంటిన్యూ చేశారు. కానీ అది కూడా కవరింగే అంటున్నారు నెటిజన్స్. ఇక రెండో అంశం విషయానికొద్దాం.

2) ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయి ప్రముఖులను 'అభినందించిన' ఐకాన్ స్టార్

తెలంగాణ ప్రభుత్వం తరహాలోనే ఏపీ సర్కార్ కూడా పుష్ప 2 మూవీ టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిందని అల్లు అర్జున్ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు చెప్పారు. సినీ పరిశ్రమకు సీఎం చంద్రబాబు సహకరిస్తోన్న తీరుకు ఆయన్ను అభినందిస్తున్నట్లు చెప్పారు.

సాధారణంగా వయస్సులో పెద్దవారు లేదా హోదాలో పెద్దవారు తమకంటే చిన్నవారు ఏదైనా సాధించినప్పుడు లేదా గొప్ప పని చేసినప్పుడు వారిని అభినందిస్తున్నట్లు చెబుతారు. కానీ ఇక్కడ అల్లు అర్జునే సీఎం చంద్రబాబును అభినందిస్తున్నట్లు చెప్పడం గమనార్హం.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కూడా అభినందించిన పుష్ప రాజ్

పుష్ప 2 ఇచ్చిన జోష్ లో ఉన్న అల్లు అర్జున్ పనిలో పనిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కూడా అభినందించారు. ఏపీ ప్రభుత్వం మద్దతు ఇవ్వడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారు అని గుర్తుచేసుకుంటూ ఆయన్ను కూడా అభినందించారు. ఇక మూడో పాయింట్ విశయానికొద్దాం.

3) ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేరు కూడా...

ఏపీ ప్రభుత్వ పెద్దలకు థాంక్స్ చెప్పిన అల్లు అర్జున్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేరు చెప్పబోయి మళ్లీ దిక్కులు చూశారు. మంత్రి దుర్గేశ్ అంటూ వేదికపై నిలబడిన యాంకర్ హింట్ ఇచ్చారు. అందుకు అల్లు అర్జున్ స్పందిస్తూ... ఆ విషయం నాకు తెలుసు కానీ పూర్తి పేరు ఏంటో చెప్పండన్నారు. పైగా... "పూర్తి పేరుతో పిలవడమే గౌరవం కదా" అంటూ అడిగి తెలుసుకున్నారు. ఇది కూడా కవరింగే అంటున్నారు నెటిజన్స్. ఇక నాలుగో విషయాణికొద్దాం.

4) కళ్యాణ్ బాబాయ్ అంటూ థాంక్స్ చెప్పిన అబ్బాయ్

పుష్ప 2 మూవీ టికెట్స్ ధరలు పెంచుకునే విషయంలో ఏపీ ప్రభుత్వం వైపు నుంచి అనుమతి లభించిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంలో కీలకంగా వ్యవహరించిన కళ్యాణ్ బాబాయ్ కు వ్యక్తిగతంగా థాంక్యూ సో మచ్ అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.

వాస్తవానికి వరసకు అల్లు అర్జున్ కు పవన్ కళ్యాణ్ మామ అవుతారనేది జగమెరిగిన సత్యం. కానీ ఎందుకో అల్లు అర్జున్ మాత్రం పవన్ ను కల్యాణ్ బాబాయ్ అని పిలుస్తున్నారు. ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ కళ్యాణ్ బాబాయ్ అని అడ్రస్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

అయితే, మామకు బదులు కళ్యాణ్ బాబాయ్ అనే పిలుపు ఎందుకు వస్తుందా అనేదే కొంతమందికి అర్థం కాని విషయం. పుష్ప 2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ స్పీచ్ చూస్తున్న వారికి ఈ మూడు అంశాలు ఆలోచనలో పడేశాయ్."వై పుష్పరాజ్ ఈజ్ డూయింగ్ లైక్ దిస్" అని నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు జవాబు ఏమై ఉంటుంది???

Tags:    

Similar News