'రోజా వనం' లో ఖుష్బూ మొక్కలు..

తెలంగాణా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి మంచి స్పందన వస్తుంది. సినీ నటుల నుంచి

Update: 2020-03-01 02:06 GMT
Khushbu Sundar, Roja (File Photo)

తెలంగాణా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి మంచి స్పందన వస్తుంది. సినీ నటుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరు ఎంతో ఉత్సాహంగా ఇందులో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. అంతేకాకుండా మరో ముగ్గురిని మొక్కలు నాటల్సిందిగా కోరుతున్నారు. ఇక 'రోజా వనం' పేరుతో సినీ నటి, నగిరి ఎమ్మెల్యే రోజా శనివారం రోజున సీనియర్ నటి ఖుష్బూతో మొక్కలు నాటించారు. హీరో అర్జున్ విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించిన ఖుష్బూ మూడు మొక్కలు నాటి అనంతరం తన తోటి నటులు అయిన మీనా, సుహాసిని, డాన్సర్ బింద్రాలకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ ని ప్రశంసించారు. పర్యావరణం గురించి అందరు ఇలా ఆలోచిస్తే ఎతో మేలు చేసిన వాళ్లమవుతామన్నారు. భవిష్యత్ తరాలకు మంచి జీవితం అందించే బాధ్యత మనపై ఉందన్నారు. పర్యావరణం రక్షణ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం మంచి ఆలోచన అని ప్రశంసించారు. ఇందులో భాగస్వామిని అయ్యే అవకాశాన్ని తనకి ఇచ్చినందుకు ఏపీ ఎమ్మెల్యే రోజాకి ధన్యవాదాలు తెలిపారు ఖుష్బూ.. ఇక రోజా మాట్లడుతూ.. 10 నిమిషాలు ఆక్సిజన్ ఇచ్చే డాక్టర్ ని దేవుడు అంటామని, మనకు జీవితం మొత్తం ఉచితంగా ఆక్సిజన్ ఇచ్చే మొక్కలను జాగ్రత్తగా , బాధ్యత గా పెంచాలని ఆమె పిలుపునిచ్చారు.

ఇక ఖుష్బూ సినీ నటిగా అందరికి సుపరిచితురాలే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని మొదలుపెట్టిన ఖుష్బూ.. హీరోయిన్ గా ఎదిగారు. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళ, హిందీ భాషలలో నటించారు. వెంకటేష్ హీరోగా వచ్చిన కలియుగ పాండవులు చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు. చివరగా ఖుష్బూ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రంలో నటించారు. ఖుష్బూ తమిళ దర్శకుడు సుందర్. సి ని 2000 సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ఆమె రాజకీయాల్లో కూడా క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నారు.  

Full View


Tags:    

Similar News