West Bengal Student: విశాఖలో బెంగాల్ విద్యార్థిని మృతి కేసులో వీడని మిస్టరీ
West Bengal Student: జులై 14న హాస్టల్ టెర్రస్ పైనుంచి కిందపడి విద్యార్థిని మృతి
West Bengal Student: విశాఖలో బెంగాల్ విద్యార్థిని మృతి కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. జులై 14న హాస్టల్ టెర్రస్ పైనుంచి కిందపడి విద్యార్థిని మృతి చెందింది. విద్యార్థినిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు విశాఖ పోలీసులు. అయితే ఏపీ పోలీస్ వర్సెస్ వెస్ట్ బెంగాల్ పోలీస్‌గా ఈ కేసు నడుస్తోంది. ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఆశ్రయించారు విద్యార్థిని తండ్రి. దీదీ ఆదేశాలతో కోల్‌కతా నేతాజీనగర్ పీఎస్‌లో కేసు నమోదైంది.
విశాఖలో విద్యార్థిని హత్యకు గురైనట్లు సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా.. విశాఖకు వచ్చి విచారణ ప్రారంభించారు వెస్ట్ బెంగాల్ పోలీసులు. హత్యా కోణంలోనే కోల్‌కతా నేతాజీనగర్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే.. విద్యార్థినిది ఆత్మహత్యగా భావిస్తున్నారు విశాఖ పోలీసులు. ముందుగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయగా.. విచారణలో కాలేజీ, హాస్టల్ యాజమాన్య నిర్లక్ష్యంగా గుర్తించారు. దీంతో.. సెక్షన్ 174 నుంచి 304 పార్ట్-2గా మార్పు చేశారు. ప్రస్తుతం FSL రిపోర్ట్ కోసం విశాఖ పోలీసులు ఎదురుచూస్తున్నారు. విచారణాధికారిగా ఉన్న 4వ పట్టణ సీఐ శ్రీనివాస్‌ను.. వీఆర్‌కు పిలిచి కేసును పర్యవేక్షిస్తున్నారు డీసీపీ-1 విద్యాసాగర్.